17, ఆగస్టు 2008, ఆదివారం

రాఖి

అన్నాచెల్లలైన
అక్క తమ్ముడులు ఐన
రక్తసంబంధమే లేకున
రాఖి కట్టి పొందు రక్షాబంధం
 భూమిపై ఆత్మీయత పంచియే వీడతీయలేని అనుభంధం

శ్రావణ మాసంలో పౌర్ణమినాడు వచ్చే  శుభాదినానికి
మూలంగా ఎన్నో కధలు వున్నా
సోదర సోదరిమనుల మధ్య ఎల్లపుడూ సహితము, ప్రేమానురాగాల
అవసరంని చెబుటనే వాటి ముక్తాయింపు

రక్షా బంధన్ అని ఉత్తరాన
రాఖి పోర్ణమి అంటూ దక్షిణాన
ఎక్కడ  పేరుతో పిలిచినా
కేవలం మా రక్షణ కోసం కాక
తమ సోదరులు మంచి మార్గమున పయనించి విజయం పొందాలని ఆసిస్తూ కట్టే  పవిత్ర తంతువుకు
జీవితాంతం  బంధం కొనసగినప్పుడే అసలైన నిర్వచనం