22, సెప్టెంబర్ 2009, మంగళవారం

స్పందన

ఆర్కుట్ లో తెలుగు పాటల సాహిత్యాని పొందుపరిచే ఒక కమ్యూనిటీలో ఎక్కువ పాటలు సేకరించిన సభ్యుల  పేర్లు చూసి, వారి అందరి పేర్లు వచ్చే విధంగా అర్ధవంతంగా ఒక కవిత రాయాలన్న ఆలోచనకు స్పందన రచన; వారి పేరులను ఉల్లేఖించి రాసాను.

మన చలనచిత్ర కవుల స్పందనకు పుట్టి
మధురనాధుడి వేణుగానమున వంశీ రాగ అందాన్ని అద్దినట్టు
సంగీత'oతో ముడి వేసుకుని గాయని గాయకుల స్వరంలో ప్రియరాగాలై పలుకుతూ
'లక్ష్మణ' 'భాను' ప్రకాశ 'వాణి'తో కావ్య 'శైల'జై
సాహితి సంపదలో అధిపత్యానికి ఎమటుకు తీసిపోని తెలుగు సినిమా సాహిత్యానికి వందనం అభివందనం

శమనం కల్పించే తీయని మాటల సమీరాలు
'ఇందు' లలన 'మమతాను'రాగాలు
ఆలోచింప చేసి వెలుగునిచ్చే తెల్లని రవికిరణాలు
స్తైర్యమిచ్చి స్ఫూర్తి ప్రేరేపించే 'కార్తికా'లు
ఇలా కేవలం పదాల మూటగా కాక, ఎన్నో భావాలుతో కూడిన అభినయమాలికలుగా
ఎందరో మహానుభావుల నిరుపమైన కలముల నుండి జారువారిన తెలుగు పాట సాహిత్యాని
జనుల కొరకు  జనకట్టు నందు పొందుపరుస్తున మీకునా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు