29, డిసెంబర్ 2009, మంగళవారం

కవిత

మదిలోని భావాలు
హృదయపు లయలో
అక్షర రూపమై జాలువారగ
వికసించిన పదాల కుసుమాల
సుమమాలిక కవిత

సునిశిత కనులు తెలిపే
తేటతెల్ల తలపులు
ఇంపైన శైలిలో ఒదగగా
పలికే అభినయ
వర్ణమాల కవిత

ఉహలకందని ఆలోచనలకు  
చలనమిచ్చి
 రూపానికి జీవం పోసి
ప్రవహించే ప్రేరణై
హృదయాలను కలిపే వంతెన కవిత

15 వ్యాఖలు:

NAM blogsapien :) చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
మరువం ఉష చెప్పారు...

ఎద స్పందనలోని భావాన్ని, అనుభూతిలోని భాష్యాన్ని వెలికి తెచ్చేదే కవిత. భాష ఒక వాహనం అంతే. కేవలం అచ్చులు హల్లుల అల్లికలోనే అది కవిత కాదు. మీరలా అనలేదు, నా అభిప్రాయం చెప్పాను.

Telugu Movie Buff చెప్పారు...

ఉష గారు మీ అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదాలు.
అచ్చులు హల్లులు గురుంచి రాయడంలో నా మనోగతం వేరే. కానీ మీరు చెప్పాక గమనించాను. నేను అనుకున్న అర్ధం అక్కడ రాలేదు అని.సరిచేసినందుకు ధన్యవాదాలు

Aditya Madhav Nayani చెప్పారు...

చాలా బాగుంది ..
నూతన సంవత్సర శుభాకంక్షలు..
నా కానుకగా ఈ టపా అందుకోండి:
http://creativekurrodu.blogspot.com/

వేణూశ్రీకాంత్ చెప్పారు...

ఫణి గారు కవిత చాలా బాగుందండీ..

Telugu Movie Buff చెప్పారు...

ధన్యవాదాలు ఆదిత్య గారు
ధన్యవాదాలు వేణు గారు

monkey2man చెప్పారు...

బాగుంది :)
నూతన సంవత్సర శుభాకంక్షలు..
"బ్లాగులోకంలో మంచి టపాలు - 2009"
కోసం ఈ కింది లంకే చూడండి.
http://challanitalli.blogspot.com/2009/12/2009.html

విశ్వ ప్రేమికుడు చెప్పారు...

చాలా బాగుంది కవిత.

నూతన సంవత్సర శుభాకాంక్షలు మిత్రమా :)

Telugu Movie Buff చెప్పారు...

ధన్యవాదాలు చల్లనితల్లి గారు,విశ్వ ప్రేమికుడు గారు

అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు

Telugu Movie Buff చెప్పారు...

శాంతి కుసుమాల పరిమళంతో
మనసు చిందించే చిరునవ్వుల వెలుగులలో
రెక్కలు తెగని పతంగులమై
ఎల్లలు లేని విశ్వాన
స్వేచా జీవులమై విహరించే
నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుదాం
మన స్వప్న లోకాన్ని నిర్మించుకుందాం

Let us Welcome and build a very happy new year with a big Good Bye to all the selfish.
Let us unite to bury the bad.
Let us take the right step ahead.

Bhadrasimha చెప్పారు...

బ్లాగు మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకంక్షలు,
ఈ కొత్త వత్సరం అందరు సుఖ సంతోషాలతో ఉండాలని మనందరి పై ఆ శ్రీ నృసింహుని కృప ఉండాలని ఆసిస్తూ మీ కోసం భద్రాచల నరసింహ క్యాలండర్ -2010 ఈ కింది లింకులో
http://bhadrasimha.blogspot.com/2010/01/2010.html
ధన్యవాదములు
- భద్రసింహ

Andhra Bidda చెప్పారు...

సర్వే జనా సుఖినో భవంతు.
అందరికీ తెలంగాణా నామ సంవత్సర శుభాకాంక్షలు

జై తెలంగాణా !
జై జై తెలంగాణా !!
……………….

తెలంగాణ వేరైతే
దేశానికి ఆపత్తా?
తెలంగాణ వేరైతే
తెలుగుబాస మరుస్తారా?
……………………. ప్రజాకవి కాళోజీ

anagha చెప్పారు...

wish you a happy new year 2010.

విశ్వ ప్రేమికుడు చెప్పారు...

నేస్తం ఏమయ్యారు ఇన్నాళ్లు? ఎప్పుడొస్తున్నారు? నేనొచ్చేశా.. :)

Telugu Movie Buff చెప్పారు...

@ విశ్వ ప్రేమికుడు
మిత్రమా, ఆలస్యంగా స్పందిస్తునందుకు క్షమించండి. ఎన్నో రోజుల తర్వాత ఇవ్వాలే log in అయ్యాను.
ప్రత్యేకించి వచ్చి నన్ను అడిగినందుకు ధన్యవాదాలు.
Profession రిత్యా hobbies కి దూరంగా ఉండాల్సి వస్తోంది.

ఏంటో మిత్రమా, తెలుగు కుడా మర్చిపోయాను, అన్నీ తప్పులు రాస్తున్నాను.
ప్రతీ వారం ఇంక క్రమం తప్పకుండా మీ అందరి టపాలు చదవాలి.