21, డిసెంబర్ 2009, సోమవారం

కాలమా! కాస్త ఆగుమా!

వినీల ఆకాశమున
వెలిగే తారకల నడుమ
విరబూసిన అందాల చంద్రిక
శశిరేఖ వేడిమి వెన్నెల కాంతుల హాయిలో   

కృష్ణవేణమ్మ గలగలల జోలాటకు 
 చిరు గాలి తోడు రాగ
కొబ్బరాకు అంచున సేదతీరిన  నీటి బొట్టు
జారు వారి తనువును పులకరించి మైమర్చగా
చేరుకున్న నిదురానగరిలో

మల్లెల మాలాల ఒదిగిన చిరునవ్వు
తేనల ఝరి కారు పలుకులు
ఒయ్యారాలెన్నో ఒలకు నర్తనతో
చారు చక్కని కలువకంటి
నా కలల రాకుమారిని చేరుటకు

స్వప్నాల సోపానాలు ఆరోహించి 
నిక్కల ఫలము అందుకొనుటకు
తెరువు తెలుసుకొను  సమయాన
కాలమానువ్వు ఆగుమా!

పొద్దు వాలుటకు అంత తొందరేలమ్మా
తరుణి చెంత లేని తరణి రాక నాకెందుకమ్మా
కాలమాకనికరించి కాస్త ఆగుమ!

సందెరేళసాగర తీరపు మేఘాల చాటున
దొబూచులాడుతున్న భానుడి మందార వెలుగుల్ని
ముడివేసుకున్న కుసుమాల పరిమళములతో
ఇంపైన మారుతం చలించు ఉల్లాసప్పు ఉయ్యాలలో

ఆహ్లాదపు అంచులు తాకుతూ
విచ్చుకున్న కేరింత తుల్లింతలతో
ఉప్పొంగిన సొగసుల కొలనులో
అందాల సుమాళియై విహరిస్తున్న
నా ఆశల తుషార అలివేణి తలంపులలో తడుస్తున్న
నా హుషారు జోరు అందుకుని పరుగులు పెట్టక
కాలమాకాస్త ఆగుమా!

నా జ్ఙాపకాల జల్లును ఆవిరి చేసి
అరుణిమ అందాల సవిత్రను దూరం జరిపి
చంద్రకాంతి లేని రేయి
ఊహలు దిగి రానివిలాసం తెలియని చెలి
కలవరింపులల జాగరిల్లు దండన నాకు ఏలనమ్మా!
 కాలమాకాస్త ఆగుమా!
నా కనులలోఅసువులో కటిక చీకటిని నింపకుమ!  

4 వ్యాఖలు:

Padmarpita చెప్పారు...

Chaala baagundi.

మరువం ఉష చెప్పారు...

నిజానికి నాకు తెలియని పదాలు కొన్ని వాడారు మీరు. సమూలం గా బాగుంది. అంతా కలిపి, ఎప్పటిదో ఓ పాత పాట గుర్తు చేసుకున్నాను. "కాలమిలా ఆగిపోని, కల నిజమై సాగిపోని, అన్నీ మరిచి ఈ నిమిషంలో నీ వొడిలోనే నిదుర పోనీ.."

Telugu Movie Buff చెప్పారు...

ధన్యవాదాలు పద్మర్పిత గారు, మరువం ఉష గారు.
నేను వాడిన పదాలు పాత తెలుగు పాటలలో వినినవే అయివుంటాయి

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

మీ కవితలన్నీ చాలా బాగున్నాయి.