వేదన లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
వేదన లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, డిసెంబర్ 2009, గురువారం

తెగులు పట్టిన తెలుగువారం

సత్యం విస్మరించి కల్పనలు నమ్ముతాం
మనలోనే తన్నుకు చస్తాం
ఒకరి మాటనొక్కరం హేళన చేసుకుంటాం
ఎవరికివారే మేమే గొప్పనే బ్రమలో బతికేస్తాం 

ఎవరే మాట చెప్పనీ
సర్వం కట్టబట్టి ఇట్టే మోసపోతాం
నిజనిజాలను లెక్క చెయ్యం
పరస్పర ద్వేషాలు మాత్రం పెంచుకుంటాం  
గుంట నక్కల స్వార్ధం ఎరగక, అమాయకపు కుక్కల్లా విశ్వాసం చూపుతాం
పాలు పోసి ఆ మొగిలినాగులను రాజులు చేస్తాం, కానీ వాళ్ళ కాటుకే బలవుతాం 

కలిసివేసే అడుగులలో ఆరంభ శూరులం
వేరు గడపల పూనదికి నిరంతర అన్వేషులం   
ఖండ ఖండాలకు వెళ్తాం
మేధా సంపతి, వ్యాపార సామర్ధ్యాలను చాటుతాం
కానీ స్వంత నేలపై ఎదగం, అవధులను ఏర్పర్చుకుంటాం 
చదువు నేర్పే బడులను
వినోదం పంచే కళాకారులనూ కూడా వేరు కళ్ళతో చూస్తాం   
అవమానిన్చుకుంటాం, మరొకరి ద్రుష్టి లో చులకనవుతాం   

తెలుగువారం తెనుగువారం 
తెగులు పట్టి తనువు తప్ప తక్కినదేది మిగలనివాళ్ళం, మిడుగులం 
తెగుపడుటకే కాదు, ఏ తలపుకూ ఏకత లేనివాళ్ళం, స్వలాభ వలపక్షకుళ్ళం
తేటతెల్ల కాని అక్కరపాటు కోరికలకు 
చుప్పనాక నేతల చేతిలో తోలుబొమ్మల్లయ్యాం   
మరోసారి చౌకబారయ్యాం

11, డిసెంబర్ 2009, శుక్రవారం

హృదయం పగిలిపోతోంది

హృదయం పగిలిపోతోంది
ఒకటా రెండా, ఐదు ముక్కలు చెయ్యమని
వినిపిస్తున్న వాదనలకు
వెక్కి వెక్కి ఏడుస్తోంది, వేదిస్తోంది

విడిపడి బాగుపడితే సంతోషమే
అని ఓ మూలాన వున్నా
ఈ చీలికలతో అవకాశవాద నాయకులకు
సామాన్యుడు మరింత చులకన అవుతాడేమో అనిపిస్తోంది, భయమేస్తోంది

ఇక సద్దుకుంటుందన్న తరుణంలో
ఎగసి మరింత పాకిన మంటలకు
బలవుతున్నది మాత్రం ఎవరు
వెనుకున్న కుట్ర తెలియక చెప్పినదల్లా నమ్మే అమాయకుడు సామాన్యుడు
ఎంతో ఆశించి, వాటి సాధనకు ఎంతకైనా తెగించి సర్వం కోల్పోతున్న విద్యార్ధి
ఎవరికి ఏమొచ్చినా ఆ కోపాగ్నికి బూడిదవుతున్న నాలుగు చక్రాల మూగ ప్రాణి

రాష్ట్రమంతా రణరంగంలా కనిపిస్తోంది
స్వప్రయోజనమే ధ్వనిస్తోంది
ప్రజా శ్రేయస్సును తుంగలో తొక్కి
స్వార్ధం నిండిన మొండితనమే రాజ్యమేలుతోంది

అందరి ఆకలి ఒకటే
రాలే కన్నీరూ ఒకటే
కానీ మా బాధే గొప్పది
మాకు జరిగినదే ఉపేక్షము అనుట తగునా 
ఇటువంటి పోలికలు విని కన్నీరు కన్నీరు పెడుతోంది
ఆత్మహత్యలు వద్దని మొర పెట్టుకుంటోంది 
ఎవ్వరినీ నొప్పించని పరిష్కారమునకు వేడుకుంటోంది, విలపిస్తోంది

జనం మాటల్లోనే స్వచ్ఛత వుంది 
వీడిపోవడానికైన, కలిసున్డడానికైనా   
వారు ఎన్నుకోవలసోచ్చిన ప్రతినిధుల మాట కాక
ప్రజాభిప్రాయం సేకరించి వారి అభిమతమునకు సమ్మతించరాదా