14, అక్టోబర్ 2009, బుధవారం

దీపావళి

జాతి మత స్థాన భేదాలకు అతీతంగా భారతీయులతో ముడివేసుకున్న దీపావళి పండుగ ఈరోజు
మరి మళ్ళి రోజే అభిప్రాయ మొదలు అన్ని భేదాలు మరల మొదలుకాక తప్పవా?
ఆసలు పండగనే చేసుకోని నాస్తికులు సైతం ఉత్సహంగా కలగలిసే సంతోషకర  శుభదినమున
ఆస్తికులలోనే  తమ కుల, మత ఘనాపాటి వాదనలకు ఒక రోజైన తెర పడదా ?
ఇలా సందేహపడుతూ, భయపడుతూ, ప్రశ్నించుకుంటూ వుండిపోక
మనం పరిష్కరించగల సమస్యలకు, చేయగల సహాయానికి ఈరోజే శ్రీకారం చుట్టుదాం

వన వాసం ముగించి, రావణుడిని  సంహరించి  శ్రీరాముడు ఆయోధ్యాకు చేరిన  రోజు
బాణసంచా  పై మన మోజును తగ్గించి సర్వసం కోల్పోయి వీధిన పడ్డ వరద బాధితులకు  మొత్తని వెచ్చించి అండగా  నిల్చి తిరిగి వారికి వెల్లుగునిద్దాం

సత్యభామ సహకారంతో  శ్రీకృష్ణుడు నరకాసురుడుని వధించిన  రోజున
బాదిత సహాయ మొత్తని స్వప్రయోజనాలకు మల్లిస్తున్న దుష్టులపై వారి స్వార్ధాని అంతం చేసే  విష్ణు చక్రాని సందిన్చుద్దాం

కాకర పువ్వతులు, భూ చక్రాలు, చిచ్చుబుడ్లు లను కాలుస్తూ మన చిన్నారులు కొట్టే కేరింతలకు సంతోషించి సరిపడక
 కవ్వింతలకు నోచుకోని పిల్లలను చదివించి రేపటి తారజువ్వలను చేద్దాం

విక్రమార్కుడు శత్రు విజయంబు గావించిన  రోజున
అభిరుద్ధిని పక్కన పెట్టి భేతాళ కధలను వినిపించే నాయకులకు మన ఓటు తూటాలతో బుద్ధి చెప్పుటకు సంకల్పిద్దాం

వ్యాపార వేత్తలు ప్రతి దీపావళికి కొత్త లావాదేవిల పుస్తకాన్ని తెరిచినట్టు
ఇక ప్రభుత్వం ప్రతి యేడు ఖర్చు పెట్టె ప్రజాసొమ్మును కచ్చిత లెక్కలతో మనకు చూపాలన్న వాద సిసింద్రలను వినిపిద్దాం

బలి చక్రవర్తిని వామనుడు పాతాళమునకు పంపిన ఇదే రోజున
మనలిని దహించవేసే మనలోని గర్వాహంకారాలు తొలగిద్దాం
చంద్రుడిని తాకే జువ్వాలా అందరితో కలిసి నడుద్దాం

పౌరుషం ఆవేశం ఒక్కసారిగా వెలుగునిచ్చి బూడిద అయ్యే  సీమ టపాసుల వంటివని గ్రహించి
విజేయులం అవ్వుటకు ప్రమిదలో వత్తులతో వెలిగే దీపం లాగ ఏకాగ్రత, ఆలోచనలకు తోడు అణుకువ, సభ్యతల అవసరం గుర్తించి

సూర్యుడి కాంతి చేరని, ఎన్ని మాతబుల వెలుగులు కూడా నింపలేని
 ప్రకాశవంతమైన కిరణాన్ని మనసాక్షితో మనలో మనం వెలిగించుకుందాం

మనలోని అమావాస్య చీకటిని పారద్రోలి
చీకటికి వెలుగులు సాధించి, విజయానికి ప్రతీకగా నిలిచే దీపావళి పండుగను అప్పుడు జరుపుకుందాం

11 వ్యాఖలు:

సుభద్ర చెప్పారు...

very very good...

Padmarpita చెప్పారు...

చక్కగా రాసారు...బాగుందండి.

పరిమళం చెప్పారు...

good post!

Telugu Movie Buff చెప్పారు...

సుభద్ర గారు, పద్మర్పిత గారు, పరిమళం గారు
మీ అందరికి నా నెనర్లు

amma odi చెప్పారు...

మీకు, మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు, సకల శుభాలు కలగాలని కోరుతూ.....దీపావళి శుభాకాంక్షలు!

CARTHEEK చెప్పారు...

mundugaa దీపావళి శుభాకాంక్షలు

super gaa rasaaru
ide rojuna inni jariginaya naaku inthavaraku theliyane theliyadu......

Telugu Movie Buff చెప్పారు...

నెనర్లు కార్తీక్ గారు.
శ్రీకృష్ణుడు, శ్రీరాముడి కధలు మాత్రమే ఎక్కువగా దీపావళికి మూలంగా చెప్తారు.
కొన్ని పుస్తకాలలో ఎన్నో కధలు గురుంచి రాసారు.
లక్ష్మి - శ్రీమహావిష్ణుల వివాహం కూడా ఇదే రోజున జరిగింది అని విన్నాను.
అలాగే, సిఖ్ మతస్థులు ఇదే రోజున Bandi Chhorh Divas పేరున పండుగ జరుపుకుంటారు.

anagha చెప్పారు...

చాల చాల బాగుందండి .

Telugu Movie Buff చెప్పారు...

నెనెర్లు అనఘ గారు

శివ చెరువు చెప్పారు...

baagundi.. korukune manchi chedula.. tapaasula dama dama...

Telugu Movie Buff చెప్పారు...

నెనెర్లు శివగారు