31, అక్టోబర్ 2009, శనివారం

ఓ యుగళ గీతం

(ఆమె)

ఏడు రంగుల ఇంద్రధనుస్సుపై జగమంత ఊయల ఊగిస్తావ!
ఏడు వేల భాషలలోని ప్రేమ పాటలను కోయిలతో పాడిస్తావ!
ఏడు అద్భుతాలలో చోటు చెరగని మన బొమ్మరిల్లుని మేఘాలలో నిర్మిస్తావా!
ఏడు స్వరాలు సరికొత్త రాగాలు పలుకుతుండగా సప్త సముద్రాలు దాటి వస్తావా!

ఇలా, ఏవో కొత్త కోరికలను
అర్ధం తెలియని ఆశలతో
అడుగుతున్న నన్ను చేరుకుంటావా
లేదా ఇదేమి పిచ్చి అని నవ్వుకుంటావా!

(అతడు)

సరదాకి కూడా నువ్వు ఏది అడిగినా
క్షణములో అంతకుమించిదేదో తెచ్చివనా!
పోనిలే వద్దు మరి అని నువ్వు అనిన
నిమిషం కాకుండానే నీ ముందు అదివుంచన!
 చిలిపి కోరికల ఆశల లోతు తెలుసుకున్న
వాటి కలలను చేరుకోనుకు నింగి అంచుకు ఎగుర్తునా!

 ఏడు రంగుల ప్రేమ, ఏడు జన్మలైన పదిలమవ్వాలని కోరుతూ
ఏడుకొండలవాడి సాక్షిగా ఏడు అడుగులు నడిచేద్దమా
ఆరు ఋతువులోను,  అరునొకటి అందాలతో
ఏడు రోజులు ఏడేడు లోకాలు చుడుతూ పయనిద్దమా

2 వ్యాఖలు:

anagha చెప్పారు...

మీ కవిత చాల బాగుంది ,అలాగే తెలుగు బాష మీద మీరు చూపిస్తున్న అభిమానం ,గౌరవం కవిత రూపములో చెప్పేరు ,చాలాబాగుంది .

Telugu Movie Buff చెప్పారు...

అనఘ గారు నెనెర్లు