31, అక్టోబర్ 2009, శనివారం

తెలుగును గౌరవించి ప్రేమించు, పులకించు!


వీనుల విందు, సిరివెన్నలల వినుకెంపు, కస్తూరి పరిమళము
చెవులకు కెంపు, వినసొంపు, చక్కెర పాకము
సరళ అజిత, శ్రావ్య వాహిని, సుధలొలికె శబ్ద సంపద
అమ్మచేతి ముద్దలోని ప్రేమ, కంటి వెలుగు అందం
కళవళికల మేళవింపు మన తెలుగు

అమృతం ఎందుకు దండగ!
తెలుగు కవితని చదివి  రుచిని పొందక!

ఏవో సొంపులను, ఎన్నో సొగసులను చూడాలన్న తపనను కలలోనైనా కనటమెందుకు!
గుండ్రపు లిపిలో, అందమైన శిల్పాలు కూడా మైమరిచిపోయేల
ముత్యాలాంటి అక్షరాలు మల్లెల పరిమళంతో కూడిన పదాలై తెలుగుననుండగా!

పారిజాత పుష్పాని అందుకోవాలని కోరికెందులకు? మరువు!!
తేట తెలుగు మాటలతో దేవతలనే ఆశ్చర్యపరిచే తేనెలొలకు మానును నిర్మించు!

శిలలను సైతం కరిగించు శక్తున్న సంగీతమునకు
తన తీయని పదాలతో స్వరానికి భావాన్ని కూర్చి మరింత శక్తిపరుచు శక్తివంతమైన భాష తెలుగు.

తెలుగు నేలపై, తెలుగు తల్లికి పుట్టిన మనకు
దేవుడు ప్రత్యక్షమై వరము ప్రసాదించినచో ఇంకేమి కోరుకుంటాము!
మన మరల జన్మనూ, ఇదే తల్లికి, ఇదే నేలపై ఇవ్వమని అడగక!
తెలుగంటే ఇష్టము, కాదు కాదు ప్రాణము కనక!

సువర్ణ కాంచనములకైన కేవలం ఒకటే రంగు, ఒకటే నైజము
కానీ, రకరకాల మాండలికములలో సందర్బానుసారం పదముల అర్ధములు మారు నమ్రముతో,
వివిధ యాసలుతో వేటికవ్వే సాటిగా ప్రకాశించు పైడి రత్నాల వర్ణాల విల్లు, మన తెలుగు.
ఇంత వైవిధ్యమున్నభాష యందు ప్రామాణికం మాదంటే మాదంటూ మనలో మనం భిన్నత్వానికి పోక
పర భాష మోజులో అణగారిపోతున్న తెలుగు భాషను ఏకత్వంతో కాపాడుకుందాం.

ఛందస్సు, అలంకారాలు మొదలగు వ్యకరణాంసాలు తగినరీతిలో అద్భుతంగా అమరిన కావ్య ఐశ్వర్యాలు
రమణీయమైన జాతీయాలు, నుడికారాలతో తమ ప్రత్యేకత ఏదైనా, నిర్దిష్టమైన ప్రయోజనాన్ని కలిగున్నఎనలేని అప్పుర్వ సాహిత్య సంపద తెలుగు సొంతం.
కాలానుసారం, ఇతర భాషా పదాలను తనలో కలుపుకునే ఉదారత్వముతో, సంస్కారపూర్వమైన భాషయ్యి
సులభమైన ఉచ్చారణతో, శ్రావ్యతకు మాధుర్యమై, సుందరమైన లిపిలోనున్న తెలుగు భాష
భారతదేశమున అనధికారంగా అత్యధికులు మాట్లాడే రెండో భాషగా
ద్వితీయ జాతీయ భాషకు హోదాకు వరుసలోనున్న ప్రధమ బాస

అట్టి సౌజన్య వాణి, లావణ్య వేణి మన మాతృభాష తెలుగును మాట్లాడుటకు చిన్నబోవక
నలుగు పెట్టి వదిలించు నీ పరభాషా పాకము!
సొంత భాష ఘనతను, హాయిని తెలుసుకుని నువ్వు మాట్లాడుతూ, మరొకరికి నేర్పించి మాట్లాడిస్తూ తలయెత్తి గర్వపడు
తెలుగును గౌరవించి ప్రేమించు, పులకించు!

పాఠశాలలో నేర్చుకున్న "మా తెలుగు తల్లి కి మల్లె పూదండ" పాట నుండి నిన్నటి "తల యెత్తి జీవించు తమ్ముడా" పాట వరకు విన్న పాటలు, మాటలు, చదివిన పుస్తకాల ప్రాబల్యంతో నా మదిలోని భావాలు ఇలా రూపుదిద్దుకున్నాయి. తప్పులుంటే క్షమించి, సరిచెయ్యండి.


6 వ్యాఖలు:

cartheek చెప్పారు...

అమృతం ఎందుకు దండగ!
తెలుగు కవిత చదివి ఆ రుచిని పొందక!

baagaa chepparu phanigaaru........

Telugu Movie Buff చెప్పారు...

నెనెర్లు కార్తీక్ గారు

sreenika చెప్పారు...

చాలా బాగుందండి,
భిన్నత్వమ్లో ఏకత్వమైన మన భాష గురించి బాగా చెప్పారు.

అజ్ఞాత చెప్పారు...

నీకు తెలుగు మీద ఉన్న ఇష్టం చుస్తే ముచ్చట వేసింది.
ఏమి అనుకోకు నాకెందుకో రాసిన విధానం నచ్చలేదు.

Telugu Movie Buff చెప్పారు...

నెనెర్లు శ్రీనిక గారు.

Telugu Movie Buff చెప్పారు...

అజ్ఞాత గారు ధన్యవాదాలు.
నాకెందుకో మీరు నాకు పరిచయం ఉన్నవారేమోనని అనిపిస్తోంది. నాకు మరొక మీడియంలో కూడా ఇదే రకమైన కామెంట్ వచ్చింది. అక్కడ చెప్పినదే ఇక్కడ చెప్పుతున్నాను.

మీరు చెప్పినది నిజం. నాది కూడా అదే అభిప్రాయం.
నేను రాసిన ఈ రచన కవితైతే కాదు. ఓ కవిత లాగ రాయాలి అని ప్రారంభించాను.
అయితే ప్రాస కుదరక, సరైన పదాలు తోచక ఎలాగైనా నా యొక్క భావాన్నినైన తెలియలజేయాలి అని పూర్తి చేసాను. దాంతో ఒక శైలి అంటూ లేక, అసంపూర్ణంగా, ఆసక్తి కలిగించలేని విధంగా ఈ రచన వచ్చింది.
దిశా నిర్దేశం మధ్యలో మారిపోవటంతో, paragraphs మధ్య flow miss అయ్యి, connect చెయ్యడంలో విఫలం అయ్యాను.
నాకు కూడా సంతృప్తి కలగకపోయినా, భావం చెప్పే ప్రయత్నం నచ్చడ్డంతో మీ ముందు వుంచాను.
మరోసారి మీ అభిప్రాయాన్ని చెప్పినందుకు కృతజ్ఞ్యతలు.