9, నవంబర్ 2009, సోమవారం

ఆ కవితే నా సంకల్ప బలం

పులకిమ్పచేయడానికే వీస్తునట్లు తాకే  చల్లని పవనం
 పవనానికి నృత్యం చేస్తూ నింగి నుండి రాలే చినుకులు
ఒక్కో చినుకుగా  చినుకులు చిరుజల్లె చిరుహాసాల జల్లు
 జల్లులో తడిసి పుడమి తల్లి మన్ను వెదజల్లె పరిమళం
 పరిమళపు స్వరములో, ఇన్నిచలనముల అసలు విలువలను రంగరించగా విరబూసిన నా  "కవిత"-

తీయని రామచిలుక పలుకులలో చెరగని గుర్తుల ఉల్లాసమై
తీరని కలలకు పచ్చని మామిడి తోరణ స్వాగతమై
గమ్యాన్ని స్మరణకు తెచ్చే గుడి గంటై మ్రోగుతూ, అన్నీతానై
ఇబ్బందులలో లోలోపన దాగిన సంతోషిని లేపుతూ, ప్రేరేపిస్తూ
ఆనందంలో ఆనందియై, ఆవేశంలో సంయమనపరుస్తు, ఆలోచనకు అందమిచ్చి
ఆచరణలో మార్గదర్శిగా జీవేతం అనే వరమునకు జీవించడం నేర్పి
అందు పొందు మానమునకు 'సంకల్ప బలం'

7 వ్యాఖలు:

cartheek చెప్పారు...

ఫణి గారు చాలా బాగా చెప్పారు అసలు కవిత ప్రకృతి నుంచి పుట్టిందే కదూ !

హను చెప్పారు...

chala baga visleashimchaaru/

విశ్వ ప్రేమికుడు చెప్పారు...

మీకవితలకు మీ సంకల్ప బలమే ఊపిరై, ఆ బలానికే మీ కవితలే సంకేతమై నిలుస్తూ మీ బ్లాగు రచన మరింత ముందుకు సాగాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నాను మిత్రమా.. :)

కవిత బాగుంది. :)

అజ్ఞాత చెప్పారు...

baga rasarandi


sudha

Telugu Movie Buff చెప్పారు...

నెనర్లు కార్తీక్ గారు, అవును మరి.
నెనర్లు హను గారు.
నెనర్లు విశ్వ ప్రేమికుడు గారు, తప్పకుండా ఆ దిశగా ప్రయత్నిస్తాను. మీరిచ్చిన ప్రోత్సాహం మర్చిపోను.
నెనర్లు సుధ గారు.

మరువం ఉష చెప్పారు...

>> పుడమి తల్లి మన్ను వెదజల్లె పరిమళం

నాకు అమిత ఇష్టం ఆ భూగంధం.

ఈ మధ్యనే చర్చకి వచ్చింది. తెలుగులో కవితలిక మనగలవా? యువతరం దాన్ని కొనసాగిస్తారా అని. మీ అందర్నీ చూస్తె చాలా సంతోషం.

వ్రాయటం మానకండి. నాకు పట్టిన జాడ్యం ఏళ్ల తరబడి వదలలేదు. మీకోసం వ్రాసుకోండి. ఏదో మీ కవితలలా చూసి వస్తే బాగా వ్రాయగలరు, వ్రాస్తారు అనిపించి అంటున్నాను.

Telugu Movie Buff చెప్పారు...

నెనెర్లు ఉషగారు.
వ్రాయటం మానను.
మీ అందరి దగ్గర నుండి నేర్చుకుంటూ నా తప్పులను తెలుసుకుంటూ, వాటిని సరిచేసుకుంటూ ముందుకు సాగుతాను.
'మీకోసం వ్రాసుకోండి' అని మీరు చెప్పటంలో ఉద్దేశం గ్రహించాను. మరోసారి మీకు ధన్యవాదాలు.