15, నవంబర్ 2009, ఆదివారం

నీ రాకతో....

ఎప్పుడు ఎప్పుడు చుస్తానానని రాత్రంతా తన రాక కోసమే ఎదురు చూపులు
మున్నెప్పుడూ చూడనిది కాదు, ప్రతిరోజూ చూసేదే
ఆయినా రోజూ ఇంకా కొత్తగా అనిపిస్తుంది, అలా చూస్తూనే వుండిపోవాలని అనిపించేంతగా

చీకటిని వదిలిన నీలాకాశం కూడా తన రాక కోసం ఎదురు చూస్తోంది 
ఇంతలో దూరంగా కనిపిస్తున కొండల నడుమ స్వర్గ లోకపు ద్వారంలా
అందమయిన వంపేదో కనిపిస్తోంది

కలలను స్వాగతిస్తూ, వాటి సాధనకు మరొకరోజుతో
ఉత్తేజానిస్తూ  భానుడు ఉదయిస్తున్నాడు
కౌగిలించుకోవాలనిపించేల ఉన్నాడు
ప్రియనేస్తంలా ప్రేరణ ఇస్తున్నాడు

సూర్యకిరణాలు దోవలో మొదట తమనే తాకినందుకు  మబ్బులు హొయలు పోతునాయి
కప్పబడిన తెరనేదో తెన్చుకునట్లు ఒక్కసారిగా  గాలి ఆహ్లాదకరంగా మారి సందడి చేస్తోంది 
రవ్వంత కూడా ఆశ లేనట్టు కాంతివిహీనమైన సరస్సుకు  వెలుగు ఊపిరినిచ్చింది
నీటిలో  ఎర్రటి కిరణాల ప్రతిబింబం మేలిమి సువర్ణ తేజమై కనువిందు చేస్తోంది

సుప్రభాతం విని మేలుకున్న శ్రీనివాసుడు
రవి సోగాస్సులను చూసి మురిసి వైకుంఠం వదిలాడు
సుదర్శనుడి ఫలములలో పులకిస్తూ
కోయిల పాటయ్యాడు, పువ్వులలో వికసించాడు

అలసి విశ్రమించిన తనువులకు  ఉల్లాసం తాకింది
పరస్పర పలకరింపులతో ఒక కొత్త రోజు మొదలైంది

11 వ్యాఖలు:

విశ్వ ప్రేమికుడు చెప్పారు...

" పరస్పర పలకరింపులతో ఒక కొత్త రోజు మొదలైంది "

మీ ద్వారా మా అందరికీ ఓ అందమైన అనుభూతిని కలిగించింది :)

Telugu Movie Buff చెప్పారు...

"ప్రకృతిలోని ప్రతి అణువునూ ప్రేమిస్తాను. ప్రేమిస్తునే ఉంటాను. ఆ ప్రేమను ఆస్వాదిస్తుంటాను"
అన్న మీ మాటలే మా అందరికి స్పూర్తి.
అలా అస్వాదించినందుకే ప్రతీది ఒక కొత్త అనుభూతి.
విశ్వ ప్రేమికుడికి నెనెర్లు.

Hima bindu చెప్పారు...

చాల బాగుంది .

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

నారాక కోసం ఎదురుచూసి కుసుమ కోమల కమనీయ కవితాశుప్రభాతాన్ని మీరు ఇంత అందంగా ఆలపించిన తరువాత కూడా రాకపోతే బాగుంటుందా? అందుకే వేకువ వెలుగునై వేవేల దీపకాంతినై విచ్చుకున్న మందార రంగుల కాంతినై వచ్చా. చెప్పండి మరి

మరువం ఉష చెప్పారు...

>> కోయిల పాటయ్యాడు,పువ్వులలో వికసించాడు
కొద్దిగా పొడిగింపు...

కోవెల గంటయ్యాడు, నవ్వులలో విరబూసాడు

దైవత్వం వెదజల్లే ప్రకృతిలోని ప్రతి అంశానికీ స్వాగతిస్తూ వచ్చే తన రాక మన అందరికీ మళ్ళి మళ్ళీ కావాలి.

Telugu Movie Buff చెప్పారు...

ధన్యోస్మి.
నా ఆలాపన ఆలకించి విచ్చేసిన భాస్కర మూర్తికి స్వాగతం, సుస్వాగతం.

ఓ ప్రభాకరా! నా స్ఫూర్తి దాత!
నీకు కోటి వందనాలు!
మిడి మిడి ఙ్ఞానంతో నడయాడుతున్న ఈ సదాసరికి
హారంలో తేనెలొలకుతూ ప్రకాశిస్తున్న పద సంపదను
నిశితపరిశీలనతో నా కైతప్పులన్ను సరిదిద్దే నేర్పరులను
వెన్నుతట్టి ప్రోత్శాహించే మిత్రులను అందించి చూపించిన
ఈ దివ్య మనోహర విజ్ఞాన పైడి బాటకు ధన్యుడను.


ఉష గారు ధన్యవాదాలు
మీ పొడిగింపు చాలా బావుంది.
నా రచనకు కొంత సంపూర్ణత వచ్చింది.

చిన్ని గారు మీకు కూడా నా ధన్యవాదాలు

పరిమళం చెప్పారు...

భానోదయాన్ని అందంగా వర్ణించారు ....

శివ చెరువు చెప్పారు...

ఓ శుభోదయం ... ;)

cartheek చెప్పారు...

బావుంది ఫణి గారు
ఉషక్క పొడిగించిన లైన్లు చాలా బాగున్నాయి కదూ!

పరుచూరి వంశీ కృష్ణ . చెప్పారు...

అలసి విశ్రమించిన తనువులకు ఈ ఉల్లాసం తాకింది
పరస్పర పలకరింపులతో ఒక కొత్త రోజు మొదలైంది........చాలా బాగుంది .............

Telugu Movie Buff చెప్పారు...

పరిమళం గారు, శివ గారు, కార్తిక్ గారు, వంశీ కృష్ణ గారు నెనెర్లు.
అవును కార్తిక్ గారు చాలా బాగున్నాయి ఆ లైన్లు.