3, డిసెంబర్ 2009, గురువారం

తెల్లని మనస్సు

కలలో మెదిలే నీ రూపురేఖలను
నా చేతి రేఖలతో ముడిపెట్టాలని తలిచా!
కరిగి విడిచి పోకూడదని!
కానీ విధి చిత్రమైనది!

వాలుక పై నీ పాదముద్రల చుట్టూ
వాలు గోడనవ్వాలనుకున్న!
గుర్తులు చెరగరాదని!
అంతలోనే అలలు నిన్ను ముద్దాడి తీసుకుపోయాయి! 

నీటిపై గీసిన నీ చిత్రాని
ఛత్రమై కాపాడుతున్న!
ఎండకు ఆవిరైపోకూడదని!
ఇట్టే పుట్టి పగిలే నీటి బుడగ మాయ తెలియక!

విరబూసిన నీ చిరుహాసాన్ని
కలబోసుకున్న పవనం నుండి
నేను తీసుకున్న శ్వాసను వదలక నాలోనే బంధించా!
నవ్వుల ఊసులైన నాతో వుండి పోవాలని!

*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*

నీ చిరునవ్వులలో రాలిన ముత్యాలతో రాసుకున్నా
నీతో నా ప్రతీ జ్ఞపకాన్ని!
ఎప్పటికీ అలా భాసిల్లాలన్ని!

చుక్కలను ఏరి, కూర్చి
నీ రేఖాచిత్రాన్ని చిత్రీకరించా! 
అన్ని తారకలు కలబోతగా ఇచ్చే తేజం నీదన్ని!

పాలతో కడిగి మల్లెపూవ్వుల సొగస్సు అద్దా
నీ బింబంలో నైనా నువ్వు కందిపోకూడదని!

కానీ నా తెల్లని కాగితంపై నీ గుర్తులు ఏవి?
పొగ మంచు కప్పేసిందా!

7 వ్యాఖలు:

సంతోష్ చెప్పారు...

baagundi.

మధురవాణి చెప్పారు...

చాలా బాగుందండీ.!

cartheek చెప్పారు...

bagundi chala bagundi mee thellani manasu...

విశ్వ ప్రేమికుడు చెప్పారు...

బాగుంది. మి మనో ఫలకంపై చెరగని ముద్ర వేసుకున్న ఇవన్నీ ఆమె గుర్తులే కదా!? :)

Telugu Movie Buff చెప్పారు...

సంతోష్ గారు, మధురవాణి గారు,
కార్తీక్ గారు, విశ్వ ప్రేమికుడు గారు
మీ అందరికి ధన్యవాదాలు.
విశ్వ ప్రేమికుడు గారు అటువంటి గుర్తులు ఏమీ లేవండి :)

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

ఫణి గారూ, అద్భుత భావ వ్యక్తీకరణ. ముత్యాల సరాన్ని కూర్చారు.

Telugu Movie Buff చెప్పారు...

భాస్కర రామి రెడ్డి గారు
ధన్యవాదాలు.