11, డిసెంబర్ 2009, శుక్రవారం

హృదయం పగిలిపోతోంది

హృదయం పగిలిపోతోంది
ఒకటా రెండా, ఐదు ముక్కలు చెయ్యమని
వినిపిస్తున్న వాదనలకు
వెక్కి వెక్కి ఏడుస్తోంది, వేదిస్తోంది

విడిపడి బాగుపడితే సంతోషమే
అని  మూలాన వున్నా
 చీలికలతో అవకాశవాద నాయకులకు
సామాన్యుడు మరింత చులకన అవుతాడేమో అనిపిస్తోంది, భయమేస్తోంది

ఇక సద్దుకుంటుందన్న తరుణంలో
ఎగసి మరింత పాకిన మంటలకు
బలవుతున్నది మాత్రం ఎవరు
వెనుకున్న కుట్ర తెలియక చెప్పినదల్లా నమ్మే అమాయకుడు సామాన్యుడు
ఎంతో ఆశించి, వాటి సాధనకు ఎంతకైనా తెగించి సర్వం కోల్పోతున్న విద్యార్ధి
ఎవరికి ఏమొచ్చినా  కోపాగ్నికి బూడిదవుతున్న నాలుగు చక్రాల మూగ ప్రాణి

రాష్ట్రమంతా రణరంగంలా కనిపిస్తోంది
స్వప్రయోజనమే ధ్వనిస్తోంది
ప్రజా శ్రేయస్సును తుంగలో తొక్కి
స్వార్ధం నిండిన మొండితనమే రాజ్యమేలుతోంది

అందరి ఆకలి ఒకటే
రాలే కన్నీరూ ఒకటే
కానీ మా బాధే గొప్పది
మాకు జరిగినదే ఉపేక్షము అనుట తగునా 
ఇటువంటి పోలికలు విని కన్నీరు కన్నీరు పెడుతోంది
ఆత్మహత్యలు వద్దని మొర పెట్టుకుంటోంది 
ఎవ్వరినీ నొప్పించని పరిష్కారమునకు వేడుకుంటోంది, విలపిస్తోంది

జనం మాటల్లోనే స్వచ్ఛత వుంది 
వీడిపోవడానికైన, కలిసున్డడానికైనా   
వారు ఎన్నుకోవలసోచ్చిన ప్రతినిధుల మాట కాక
ప్రజాభిప్రాయం సేకరించి వారి అభిమతమునకు సమ్మతించరాదా  

21 వ్యాఖలు:

Anil Dasari చెప్పారు...

రాజీనామాలు ప్రజల వత్తిడితో కాక స్వలాభాల కోసం చేశారని మీరనుకుంటున్నారా? అలాంటి వారు అసలే లేరని కాదు .. కానీ గుంటూరు జిల్లాలో నలుగురు ఎమ్మెల్ల్యేల నుండి నేను స్వయంగా తెలుసుకున్నమాటిది.... ఈ ప్రతినిధులకి హైదరాబాదుతో ఏ సంబంధమూ, అవసరమూ లేని సాధారణ ఓటర్ల నుండి వస్తున్న ఫోన్ కాల్స్ సంఖ్య, చీలిక చూస్తూ ఊరుకుంటే నియోజకవర్గంలో అడుగు పెట్టనీయమన్న హెచ్చరికల సంఖ్య అసంఖ్యాకంగా ఉంది.

స్వలాభాలే ముఖ్యమైతే హైదరాబాది ఏ రాష్ట్రంలో ఉన్నా వారి పెట్టుబడులకి ఢోకా ఉండదు. బిజినెస్ చేసుకునేవాడికి ఎక్కడైనా ఒకటే. ఈ రాజీనామాలు ప్రజాగ్రహం లోనుండి పుట్టుకొచ్చినవే.

తెలుగు వెబ్ మీడియా చెప్పారు...

హైదరాబాద్ మీద అంత మోజు లేకపోతే రాజకీయ నాయకులు గూండాలని పంపించి షాపులు ముయ్యించడం ఎందుకు? గూండాయిజం చాలా తక్కువగా ఉన్న శ్రీకాకుళం పట్టణంలో కూడా వీధుల్లో గూండాలని తిప్పి షాపులూ, ఆఫీసులూ, బ్యాంక్ లూ, హాస్పిటళ్ళూ ముయ్యించడం ఎందుకు?

Telugu Movie Buff చెప్పారు...

రాజీనామాలు ఇంచుమించు అందరూ ప్రజల వత్తిడితో చేసారు అన్నది నిజం.
స్వలాభాలు కోసం చేసిన వాళ్ళు కొందరు ఉండచ్చు. స్వార్ధం అనటంలో నా ఉద్దేశం రాజీనామాలుపై కాదు.

తమ ప్రాంతాలలో ప్రజల మనోభావాలు తెలిసి కూడా గుంపులో గోవిందగా ఎన్నికల ముందు ప్రత్యేక రాష్ట్రముకు ఎందుకు సై కొట్టడం?
ఎన్నికలలో గెలవాలన్నే స్వప్రయోజనానికి తప్ప!

ఇన్ని రోజులు మౌనంగా వుండి, ఒక రాత్రి ఆ విధంగా ప్రకటన చెయ్యడం ఏమిటి?
దీర్గకాలిక పార్టీ స్వప్రయోజనాలు కోరి తప్ప!
నిజంగా ప్రజా శ్రేయస్సుకు చేసి వుంటే
అనుసరించ వలసిన మార్గం అది కాదె

ఇంకా టీవీలలో జరుగుతున్న చర్చలలో వివిధ పార్టీ నాయకుల వాదనలులలో

ఇలా ఇదంతా స్వార్ధమే కదా...

ఇంక, హైదరాబాద్ పై పెట్టుబడుదారులకు, రాజకీయ గుండాలకు మోజు సంగతి నాకు తెలియదు కాని
బ్రతుకు తెరువుకు వలస వచ్చిన ఓ సామాన్యుడికి పెరిగిన చోటుపై ఎంతో మమకారం వుంటుంది.
ఆ బంధానికి రాష్ట్రం పేరు మాత్రమే మారితే పర్వాలేదు కానీ, వారిలో అభద్రతా భావం కలిగించడం చాలా తప్పు.

Unknown చెప్పారు...

రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు.
ఒకరు చెప్పేది మరొకరికి నచ్చితేనే ముచ్చట్లు
...
ఇద్దరిలో ఒకరు మాత్ర మే కోరుకుంటే అది పెత్తనం అవుతుంది తప్ప
సమైక్యత ఎట్లా అవుతుంది.
...
మీ పెత్తనం కోసం మీరెన్ని పోరాటాలు చేసినా,
ఎన్ని పదవీ త్యాగాలు చేసినా ఫలితం వుండదు.
ఈడ్చి తన్ని సారీ చెప్తే ఎవడు హర్షిస్తారు?

తెలుగు వెబ్ మీడియా చెప్పారు...

రైల్వే ప్రోజెక్టులూ, ఇరిగేషన్ ప్రోజెక్టుల విషయంలో ఏ రెండు రాజకీయ పార్టీల మధ్యా ఏకాభిప్రాయం ఉండదు. తెలంగాణా విషయంలోనే ఏకాభిప్రాయం ఎందుకు వచ్చినట్టు? హైదరాబాద్ మీద మోజు వల్ల కాదా? తెలంగాణాకి వ్యతిరేకంగా ఈ పార్టీలు ఏకమవ్వడం వెనుక స్వార్థ ప్రయోజనం లేదనుకోవాలా?

Telugu Movie Buff చెప్పారు...

రెండు కళ్ళతో చూసినా, మనసుతో చదివినా
ఏ పక్షాన ఉండక చూసుంటే ఏ తట్టుకు చెందని అలమట కనిపించేది.
లేదంటే తెలంగాణా వాదము నిండిన మనస్సు ఇలానే స్పందిస్తుంది.
కొన్ని పదాలనే పట్టుకున్ని, ఆ కన్ను ఎదుట వ్యక్తిని వ్యతిరేకిగా, సమైక్య వాదుడిగా ముద్ర వేసుకుంటుంది.

ఇద్దరిలో ఒకరే కోరుకుంటే అది పెత్తనమైతే
మూడింట రెండితలు కోరుకుంటే అది అధిక సంఖ్యాకుల తలంపుగా సమ్మతం అవుతుంది.
తాను నమ్మిన వైఖరిని బలపరచని అందరిన్ని
ఈడ్చితన్ని ఇలా చెందని కోవలోకి వర్గీకరీస్తే
ఎవరు మటుకు హర్షిస్తారు

ఏకాభిప్రాయం ఏ విషయంలోను లేదు
ఇంక ఒక రాష్ట్ర విభజన విషయంలో ఎన్నాలైనా రాదేమో. అందుకే అధిక సంఖ్యాకుల తలంపు ముఖ్యం.
తెలంగాణాకి వ్యతిరేకంగా పార్టీలు ఏకమవ్వడం కొందరి కోణంలో స్వార్థ ప్రయోజనం గానే కనిపించచ్చు. అదే నిజమై ఉండచ్చు.
కానీ తెలంగాణేతర వారికి మాత్రం అది ఏకతాటి పై చేసే పోరాటంగానే కనపడుతుంది.
ఆ పోరాటం మాత్రం హైదరాబాద్ పై మోజు తో కాదు, మమకారంతో ఇంకా హక్కుగా భావించి కూడా.
దేశంలో ఏ నగరం లోనైనా నివసించే హక్కు అందరికి వుంది
కానీ వారిలో అభద్రతా భావం కలిగించడం ముమ్మాటికి తప్పే
ఎంత వివరణ ఇచ్చినా, ఆ తప్పే జరగకవుండుంటే ఈ రోజు ఇంత సెగ వుండేది కాదేమో

కొత్త రాష్ట్రమా లేదా సమైఖ్యమా లేదా ఇంకేదైనా అది అధిక ప్రజల అభిమతం అయ్యిఉండాలి
ఎన్నికల తరహాలో ప్రజల అభిప్రాయం కేంద్ర ప్రభుత్వం ఎందుకు సేకరించకూడదు?

తెలుగు వెబ్ మీడియా చెప్పారు...

పెండింగ్ ఇరిగేషన్ ప్రోజెక్టుల కోసం ఒక్క ఎమ్మెల్యే కూడా ఎందుకు రాజీనామా చెయ్యలేదో అడగండి? పెండింగ్ రైల్వే ప్రోజెక్టుల కోసం వేర్వేరు పార్టీలు ఎందుకు కలవలేదో అడగండి? ప్రజలకి ఇవేమీ అవసరం లేదనీ, సమైక్యాంధ్ర పేరుతో హైదరాబాద్ మీద మోజే ముఖ్యమనీ అనుకుంటున్నారు.

Telugu Movie Buff చెప్పారు...

ప్రాజెక్టుల విషయంలో సొంత పార్టి నాయకులతోనే రాజీపడని నాయకులు వున్నారు. ప్రజలూ వున్నారు.
హైదరాబాద్ యేభై యేళ్ళకు పైగా రాజధానిగా ఎక్కువ మంది ప్రజలకు ముడి పడింది.

जागो तेलंगाना वाले ..भागो आंध्र वाले
వంటి నినాదాలు తప్పుడు సంకేతాలు పంపాయి.

కష్టపడి హైదరాబాద్ పరిసారాలలో ఇల్లు కట్టుకున్న వారిలో రేగిన అభద్రతా భావం ఇప్పుడు ఎలా తొలగిస్తారు?
పెరిగిన చోటుగా వారికి మమకారం వుండ కోడదా? అక్కడ ఉండటానికి వీసా అవసరం లేదే!
అమెరికాలో పుట్టిన పిల్లలు అమెరికన్ సిటిజెన్స్ అవ్వుతారు.
మరి సొంత దేశంలోనే మరో ప్రాంతం నుంచి వలస వచ్చిన వారికి, ఇక్కడ పుట్టిన పిల్లలలో అభద్రతా భావం కలిగిస్తే ఎలా?

వీసాలు, ఇంకెన్నో అనుమతులు అవసరమైన విదేశాలలో కొన్ని ప్రాంతాలలో ఒకే వీధిలో రెండేసి భారతీయ హోటల్స్, రెస్టారెంట్లు వున్నాయి.
మరి హైదరాబాద్ నగరంలో ఆంధ్ర భోజనం బోర్డుతో హోటల్స్ వుంటే తప్పేంటి? ఢిల్లీలో కూడా తెలుగు బోర్డులతో వున్నాయే.
ఆ బోర్డులు పీకేస్తాం, ఆ హోటల్స్ మూయించి వేస్తాం అంటే ఎలాగా? నగరంలో వ్యాపారం చేసే హక్కు వారికి లేదా?

ఒకప్పుడు వృతి విద్యల కళాశాలలో ప్రవేశం, ప్రభుత్వ ఉద్యోగాలు కోసం స్తానికుడై వుండాలంటే, వారు ఆ ప్రదేశం లో 15 సంవత్సరాల నుంచి నివాసితులై ఉండాలి.
కానీ తెలంగాణా రాష్ట్రం కోసం పోరాడిన చెన్నా రెడ్డి పదవి కోసం ఉద్యమాన్ని నీరుగార్చింది కాక, ఆ నియమాన్ని 5 సం|| నివాసం వుంటే స్తానికుడిగా పరిగణించే సూత్రాని అమలు పరిచారు.
ఆ నియమంతోనే హైదరాబాద్ కు వలస వచ్చిన ఎందరో ఉద్యోగాలు పొంద కలిగారు. మరి ఇప్పుడు కొత్త రాష్ట్రము వస్తే ఆ నియమానే వర్తింప చేస్తారా?

పోనీ హైదరాబాద్ అంటే మోజే అనుకుందాం. ఏం ఎందుకు ఉండకూడదు?
ఐనా సమైక్య ఆంధ్ర ప్రదేశ్ వాదనకు కారణం హైదరాబాద్ ఒకటే కాదు. ఇంకా చాలా వున్నాయి.

సూర్యుడు చెప్పారు...

@అబ్రకదబ్ర:

You are already rocking with your stories and now showing lot of potential for telling jokes as well ;)

why can't you create a new blog for sharing jokes like this ;)

తెలుగు వెబ్ మీడియా చెప్పారు...

పెండింగ్ ఇరిగేషన్ ప్రోజెక్టుల కోసం ఒక్క ఎమ్మెల్యే కూడా రాజీనామా చెయ్యలేదు. పెండింగ్ రైల్వే ప్రోజెక్టుల కోసం కూడా ఎవడూ రాజీనామా చెయ్యడు. సమైక్యవాదం అంటూ రాజీనామా చేసి ప్రత్యేక తెలంగాణా వస్తే హైదరాబాద్ మనకి కాకుండా పోతుంది, తెలంగాణా దొంగలని ద్వేషించండిరా అంటూ ప్రజల ముందు కేకలు వెయ్యడం ఎందుకు?

అజ్ఞాత చెప్పారు...

@SuuryuDu,
సెలైన్,జ్యూసులతో నిరాహార దీక్ష చేసే దొరకు కాల్మొక్కక, వాని వెంకాల గొఱ్ఱెలలగా తిరుగుతూ ఉండటం కంటే, తెలుగు మాట్లాడుతూ తెలుగుతల్లి విగ్రహాలు పగలగొట్టటం కంటే జోకులు ఎవరయినా వెయ్యగలరా? కిరసనాయలు డబ్బా మీకెమయినా కావాలా తెలంగాణా వీరుడు గారూ?

సూర్యుడు చెప్పారు...

@అజ్ఞాత:

Yes please, one tanker full ;)

Telugu Movie Buff చెప్పారు...

హైదరాబాద్ లో తమ భూములన్ను కాపడుకోవడానికేమో!
ఆ కేకలు ఎందుకో మీరైతే బాగా చెప్తారు ప్రవీణ్ గారు.
ప్రాజెక్ట్ల విషయంలో రాజీనామాల సంగతి నాకు తెలియదు

tanker సంగతి నాకు అసలే తెలియదు, నేను involve కాను!

తెలుగు వెబ్ మీడియా చెప్పారు...

శ్రీకాకుళం జిల్లా నౌపడ గ్రామం నుంచి ఒరిస్సాలోని గుణుపురం వరకు ఉన్న 91 కిలో మీటర్ల నేరోగేజ్ లైన్ ని బ్రాడ్ గేజ్ గా మార్చాలని ఒక్క రాజకీయ నాయకుడు కూడా డిమాండ్ చెయ్యలేదు, రాజీనామా చెయ్యలేదు. 1989లో రైల్వే శాఖవాళ్ళు ఆ రైల్వేలైన్ ని పూర్తిగా ఎత్తివేస్తాం అని అంటే కొంత మంది ఒరిస్సా రాజకీయ నాయకులు గొడవ చేశారు. ఆంధ్రా నాయకులు మాత్రం పట్టించుకోలేదు. ఆ రైల్వే లైన్ బ్రాడ్ గేజ్ పనులు 37 కిలో మీటర్లు పూర్తయ్యాయి. ఇలాంటి ఉదాహరణలు మన రాష్ట్రంలో చాలా ఉన్నాయి. తమ ప్రాంతాన్ని డెవెలప్ చెయ్యడం చేతకాని రాజకీయ నాయకులు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్స్ ధరల గురించి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు వెబ్ మీడియా చెప్పారు...

తెలంగాణాలో వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు ఈ సమైక్యవాదులు మన తెలుగువాళ్ళు ఎలా చస్తున్నారో పట్టించుకోలేదు. హైదరాబాద్ కోసం మాత్రం వచ్చింది దొంగ పట్టింపు.

Nrahamthulla చెప్పారు...

100% తెలుగు ప్రజలున్న యానాం ను ఇప్పటికైనా తమిళ పుదుచ్చేరి నుండి విడదీసి సమైక్యాంధ్రలో కలపాలి.

Bolloju Baba చెప్పారు...

యానాన్ని ఆంధ్రాలో ఎందుకు కలపలేదు?
see this link for answer

http://yanamgurimchi.blogspot.com/2008/05/blog-post_2177.html

Telugu Movie Buff చెప్పారు...

@వెన్నెల రాజ్యం
దేశాన్నికి రాష్ట్రన్నికి ఒకటే పోలికనా
ఒకరిద్దరి అభ్యంత్రాలకే ఈ దేశంలో పనులు ఆగిపోతే ఒక అడుగునే ముందుకు పడుతుందా

@ప్రవీణ్ గారు
ఏ ప్రాంతం వారైన రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే ఓ సగటుజీవి చేసినది కూడా అయ్యో పాపం అని సానుభూతి చూపడమే.
మరి హైదరాబాద్ విషయంలో వారికి ఏదో ఒక విధంగా అనుబంధం వుండడం, కొందరి ఉద్దేశంలో స్వార్ధం కానీయండి, మీ ఉద్దేశంలో మోజు కానీయండి, ఇంకొందరి ఉద్దేశంలో ఇంకోటేదో కానీయండి
అందుకే కొందరి ద్రుష్టిలో ఈ పోరాటం, కొందరి ఉద్దేశంలో పంతం, ఇంకా అడ్డు పడడంనో ఇంకాఏదో

@బాబా గారు
మాకు తెలియని విషయాలను మీ బ్లాగ్లో చక్కగా వివరించారు.
మన దేశం లో కూడా ఇప్పుడు ఇలా కొత్త రాష్ట్రాల ఏర్పాటు కు ప్రజాభిప్రాయం ఎందుకు తీసుకోకూడదు

తెలుగు వెబ్ మీడియా చెప్పారు...

రైతుల ఆత్మహత్యలు గురించి మాట్లాడని వాళ్ళు సమైక్యత గురించి మాట్లాడడం వాళ్ళ స్వార్థ ప్రయోజనానికే నిదర్శనం. రాష్ట్రంలో 70% మంది గ్రామీణ ప్రాంతాలలో ఉంటున్నవాళ్ళే. గ్రామీణ ప్రజల జీవితాల కంటే కొద్ది మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చే హైదరాబాద్ ఐ.టి. పరిశ్రమ గొప్పది కాదు.

Telugu Movie Buff చెప్పారు...

ఏ పరిశ్రమ గొప్పది అన్న విషయం పక్కన పెడితే
వ్యవసాయ రంగం నిర్లక్ష్యానికి గురైంది అన్నది నిజం.
తెలంగాణా ప్రాంతంలో మరింత నిర్లక్ష్యానికి గురైంది.

ఇప్పుడు తెలంగాణా ఏర్పడినా, సమైఖ్య లేదా మరే ఇతర వాదనల వల్ల ఆలస్యమైనా, ఒకవేళ రాకపోయినా
అన్నిటి కంటే ముందుగా తిర్చవలసినది నీటి సమస్య.
తెలంగాణాలో వున్న నాగార్జున సాగర్, శ్రీశైలం డ్యాం మొ|| వాటి వాళ్ళ ఆ ప్రాంతం కంటే లబ్ది పొందుతున్నది మాత్రం వేరే ప్రాంతాలు.
అలాగే ప్రతీ రాష్ట్రన్నికి పక్క రాష్ట్రాలతో ఇటువంటి సమస్యలు వున్నాయి.

వీటన్నీటికి ఉత్తమ పరిష్కారం నదుల అనుసంధానం.
త్రాగు నీరే కాదు, ముఖ్యంగా వ్యవసాయానికి సంభందించి రాష్ట్రాల మధ్య జల పంపకాలలో వచ్చే ఇబ్బందులను తగ్గిస్తుంది.
అప్పుడు కొత్త రాష్ట్రాలు వచ్చినా అతి ముఖ్య మైన సమస్యలో పెద్ద గందరగోళం ఉండదు.
కానీ ఏ పార్టీ మటుకు ఈ ప్రాజెక్ట్ పై ఇప్పుడు పోరాడుతోంది?

Nrahamthulla చెప్పారు...

బాబాగారూ
మీరిచ్చిన సమాచారం బాగుంది.మన పక్కనే ఉన్న యానాం ను రాష్ట్రంలో కలపాలని అడగకుండా సమైక్యవాదులు ఎందుకు విడిచిపెడుతున్నారో అర్ధం కావటం లేదు.ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ దగ్గర 30చ.కి.మీ.విస్తీర్ణం ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాం . దాదాపు 30వేల జనాభా.యానాం పర్యాటక ప్రాంతం. యానాం వార్తలు తూర్పుగోదావరి పేపర్లలోనే వస్తాయి.యానాంకు రాజధాని పాండిచ్చేరి సుదూరంగా తమిళనాడులో870కి.మీ దూరంలో ఉంది .యానాం 1954 దాకాభారత్ లో ఫ్రెంచ్ కాలనీగా ఉంది.నేడు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో భాగం.1954లో లో విమోచనం చెంది స్వతంత్రభారతావనిలో విలీనంచెందినా 1956 లో భాషా ప్రాతిపదికన తెలుగు రాష్ట్రంలో కలవలేదు.1948లో హైదరాబాద్ ను పోలీసు చర్యజరిపి ఇండియాలో కలిపారు.1949 లో అప్పటికి ఒక ఫ్రెంచి కాలనీ గా ఉన్న చంద్రనాగూర్, సమీపంలోని బెంగాల్ రాష్ట్రంలో విలీనం అయింది. కాకినాడ మునిసిపల్ కౌన్సిల్ కూడా యానాన్ని కలపాలని తీర్మానం చేసింది. 870కి.మీ దూరంలోని తమిళ పుదుచ్చేరి నుండి పాలన కష్టంగా ఉంది.పుదుచ్చేరికి యానాం ప్రజల ప్రయాణం ఆంధ్రలోని కాకినాడ నుండి జరుగుతుంది. గోదావరి తూర్పు డెల్టా కింద యానాం తాగునీటి ట్యాంకులను నింపాల్సి ఉంది.పుదుచ్చేరికి రాష్ర్ట ప్రతిపత్తి కల్పించేందుకు ప్రభుత్వ స్థాయిలో ప్రయత్నిస్తున్నది. తాళ్లరేవుకు కూతవేటు దూరంలో ఉన్న పుదుచ్చేరి కేంద్రం పాలిత ప్రాంత పరిధిలో యానాం వాసులకు అనేక ప్రత్యేక రాయితీలు అందుతోన్న విషయం విదితమే. రాష్ట్రాలతో పోల్చి చూస్తే కేంద్రపాలిత ప్రాంతంలో పన్ను రాయితీలు ఉన్నందున అక్కడ రేట్లు తక్కువగా ఉంటాయి. జిల్లా మధ్యలో ఉన్న యానాం కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్నందున కేంద్ర పాలిత ప్రాంత ప్రత్యేకతలు జిల్లావాసులకు ఎరుకే. అక్కడి సౌకర్యాలు అంది పుచ్చుకునేందుకు యానాం వాసులుగా నకిలీ ధ్రువపత్రాలతో ఆంధ్రావాసులు యానాంలో ఉంటున్నట్లు తెలుస్తోంది. కేంద్ర పాలిత ప్రాంతాలు పరిధి తక్కువ కావడంతో కేంద్ర నిధులు భారీగా ఉండడమే కాకుండా ప్రత్యేక సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. యానాంలో పరిశ్రమల స్థాపనకు భారీ మొత్తాల్లో సబ్సిడీలు, ఇతరత్రా సదుపాయాల కోసం అక్కడ పరిశ్రమల స్థాపనకు ఆంధ్రా పారిశ్రామిక వేత్తలు ఉత్సాహం చూపేవారు. అయితే సౌకర్యాలు పొందిన తర్వాత పరిశ్రమలను మధ్యలో వదిలివేసిన సంఘటనలున్నాయి.క్రమేపీ పుదుచ్చేరికి రాష్ర్ట ప్రతిపత్తి కల్పించేందుకు పుదుచ్చేరి ముఖ్యమంత్రి సుముఖత చూపుతుంటే, మంత్రి మల్లాడి కృష్ణారావు మాత్రం ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దశాబ్దాల నుంచి ఉన్న ఈ ప్రతిపాదనపై యానాంలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని యానాంలో ఏర్పాటు చేయాలని యానాం కాంగ్రెస్ తీర్మానించింది.ఇండోర్ స్టేడియం,కళ్యాణమండపం,ధవళేశ్వరం-యానాం మంచినీటి ప్రాజెక్టులకు రాజశేఖరరెడ్డి పేరు పెడతామని పుదుచేరి రెవిన్యూ మంత్రి మల్లాడి కృష్ణారావు చెప్పారు. యానాంలో దేశంలోనే అతిపెద్ద 26 అడుగుల భారతమాత కాంస్య విగ్రహాన్ని విజయవాడకు చెందిన బొర్రా శివప్రసాద్‌ సుందరంగా తీర్చిదిద్దారు.తెలుగుజాతి సమైఖ్యత,భాషాప్రయుక్తరాష్ట్ర ప్రధాన ఉద్దేశ్యం యానాం ఆంధ్రప్రదేశ్ లో కలిస్తే నెరవేరుతుంది.తెలుగుతల్లి బిడ్డలందరూ ఒకేరాష్ట్రంగా ఉంటారు.సమైక్యాంధ్ర కోసం ఇప్పుడు ఉద్యమాలు జరుగుతున్నాయి గనుక భౌగోళికంగా సామీప్యత, 100% తెలుగు ప్రజలున్న యానాం ను ఇప్పటికైనా తమిళ పుదుచ్చేరి నుండి విడదీసి సమైక్యాంధ్రలో కలపాలి.కలిస్తే బాగుంటుందని ఆశ.మీరు చెప్పినట్లు యానాంను తెలుగు ప్రాంత పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెయ్యాలి.