13, డిసెంబర్ 2009, ఆదివారం

పూల వనం

రంగురంగుల పూలతో కళకళలాడుతున్న పూలవనం 
ఒకటే నైజం కలిగిన రకరకాల కుసుమాల మైత్రితో ప్రకాశిస్తున్నరమణీయ నేల
పూలజాతులు వేరైనాపలికే సువాసనలు ఎన్నున్నా  
తమలో పారే అంకురం ఒకటిగాఐక్యమైన అంతరాత్మతో వికసిల్లుతున్నఅనురాగాల మాగాణి 

కొలిచే భగవంతుడు వేరైనాపూజించే విధానం ఏదైనా 
అందరి మనోగతం ఒకటేఅభిమతం ఒకటే 
తమతో పాటు సమేతంగా అందరి వికాసం కోరి 
విఘ్నాలను వీగి విరియుటకు ఆశీస్సు పొందుటకే  

మౌలిక ప్రవృతి ఒకటే అయినా       
రంగో పరిమళమో లేదా మరే తరముల వలనో కొత్త వర్గముల మొగ్గలు పుట్టినా    
ప్రత్యేకిత సంతరించుకున్నా, పుచేది  ప్రసూనాల తోటలోనే, భాసిల్లేది  పూలవనపు సుమగానే
అది లేనిపోని కట్టులతో వాడి రాలనంత వరకే

పువ్వు తన పరిమళ్ళాన్ని నలుదిక్కులా వెదజల్లగలిగేది 
తడి ఆరని రూపుమార్పని నీడ కలిగి 
 చెంతకు వాలిపోనీయకసరళంగా నిలపగలిగే పవనం తోడైనప్పుడే
 యోచనా లేక ఒక మొగ్గా తెమ్పబడనంత వరకేచులకన కానంతవరకే


ఇక్కడ భారత దేశాన్ని పూలవనం గా ఊహించుకున్నానని గమనించగలరు

7 వ్యాఖలు:

అజ్ఞాత చెప్పారు...

poolajada bharatha desam annaru bane undhi
kaani meeru emi cheppadalchukunnaro clarity miss ayindhi
idhi naa opinion - rajesh

విశ్వ ప్రేమికుడు చెప్పారు...

చాలా బాగా రాశారు మిత్రమా. అయితే పూల జడకు బదులు, పూల వనం ఊహతో రాసి ఉంటే ఇంకా బాగా వచ్చేది కవిత. మరోసారి ప్రయత్నించండి. :)

Telugu Movie Buff చెప్పారు...

రాజేష్ గారు ధన్యవాదాలు.
సృష్టత ఉండేలా జాగర్తపడతాను.

@విశ్వ ప్రేముకుడు
మిత్రమా ధన్యవాదాలు
మీ సూచనలకు ప్రత్యేక ధన్యవాదాలు
మళ్లీ ప్రయత్నిస్తాను.

cartheek చెప్పారు...

బాగా రాసారు ఫణి గారు..

sreenika చెప్పారు...

చాలా బాగా రాసారు.
మంచి భావన.మీ ఊహల్లో భారతం ఓ పూలతోట.
చివరి స్టాంజా మరింత పదునుగా చెప్పచ్చేమో.

Kalpana Rentala చెప్పారు...

ఫణి గారు,

మీ దగ్గర భావం వుంధి కానీ చెప్పే విధానం మీద కొంచెం శ్రధ్ధ పెట్టాలేమో అనిపించింది. మరీ వాక్యాల్లగా కాకుండా తక్కువ పదాలతో భావం వ్యక్తీకరిస్తే కవిత్వం గా పండుతుంది.

కల్పనా

Telugu Movie Buff చెప్పారు...

ధన్యవాదాలు కార్తీక్, శ్రీనిక గారు, కల్పనా గారు
శ్రీనిక గారు, కల్పనా గారు
మీ సూచనలకు ప్రత్యేక ధన్యవాదాలు.

మళ్ళీ ప్రయత్నిస్తాను శ్రీనిక గారు

నిజమే కల్పనా గారు
ఇన్ని రోజులు భావనను అలా వ్యాక్యాలు రాసుకుపోయాను.
ఇక నుంచి మీరు చెప్పిన విధంగా ప్రయత్నిస్తాను.