17, డిసెంబర్ 2009, గురువారం

తెగులు పట్టిన తెలుగువారం

సత్యం విస్మరించి కల్పనలు నమ్ముతాం
మనలోనే తన్నుకు చస్తాం
ఒకరి మాటనొక్కరం హేళన చేసుకుంటాం
ఎవరికివారే మేమే గొప్పనే బ్రమలో బతికేస్తాం 

ఎవరే మాట చెప్పనీ
సర్వం కట్టబట్టి ఇట్టే మోసపోతాం
నిజనిజాలను లెక్క చెయ్యం
పరస్పర ద్వేషాలు మాత్రం పెంచుకుంటాం  
గుంట నక్కల స్వార్ధం ఎరగక, అమాయకపు కుక్కల్లా విశ్వాసం చూపుతాం
పాలు పోసి  మొగిలినాగులను రాజులు చేస్తాం, కానీ వాళ్ళ కాటుకే బలవుతాం 

కలిసివేసే అడుగులలో ఆరంభ శూరులం
వేరు గడపల పూనదికి నిరంతర అన్వేషులం   
ఖండ ఖండాలకు వెళ్తాం
మేధా సంపతివ్యాపార సామర్ధ్యాలను చాటుతాం
కానీ స్వంత నేలపై ఎదగం, అవధులను ఏర్పర్చుకుంటాం 
చదువు నేర్పే బడులను
వినోదం పంచే కళాకారులనూ కూడా వేరు కళ్ళతో చూస్తాం   
అవమానిన్చుకుంటాం, మరొకరి ద్రుష్టి లో చులకనవుతాం   

తెలుగువారం తెనుగువారం 
తెగులు పట్టి తనువు తప్ప తక్కినదేది మిగలనివాళ్ళం, మిడుగులం 
తెగుపడుటకే కాదు,  తలపుకూ ఏకత లేనివాళ్ళం, స్వలాభ వలపక్షకుళ్ళం
తేటతెల్ల కాని అక్కరపాటు కోరికలకు 
చుప్పనాక నేతల చేతిలో తోలుబొమ్మల్లయ్యాం   
మరోసారి చౌకబారయ్యాం

2 వ్యాఖలు:

అజ్ఞాత చెప్పారు...

ఏం చేయగలం.. రాజకీయ నాయకుల చేతుల్లొ కీలు బొమ్మలయ్యామండి..

Telugu Movie Buff చెప్పారు...

మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు
ఆ రోజు చాలా కలత చెంది అలా రాసానెండి.
యే మాటకు ఆ మాట చెప్పుకోవాలి, మనం ఏమీ చెయ్యలేమ్.