18, ఆగస్టు 2008, సోమవారం

ఉహాసుందరి

మధురమైన బాలు స్వరములో
బిస్మిల్లా షెహనాయి నాదముతో
కీరవాణి రాగంలోన సిరివెన్నల రచనవై
ప్రాణం పోసుకున్న ఓ బాపు బొమ్మ
నీకు ఇంక సాటి ఎవరమ్మా!

పలుకులు నేర్చిన ఆ కోయల గాత్రం
తన నడకలో దాగిన నెమలి నాట్యం
నల్లని వర్ణమునకు మారి ఆమె కంటి కాటుక అయిన ఆ మెరుపుల వైనం
తన వన్నె, గుణములను అందించిన మల్లెపువ్వు తీరు వర్ణనాతీతం

కన్నార్పక నిన్నే చూస్తున్న నయనాలకు ఓ మేఘం చిరుజల్లై కురవగా  
సన్నగిలిన తుంపరకు ఓ ఆకున వున్న నీటిబొట్టు నీ బుగ్గపై దిష్టిచుక్కవగా
ఓ చల్లని పవనానికి నీ నుదిటి మీదుగా బుగ్గలును చేరిన ముంగురులును నువ్వు నీ చేతితో తిప్పుతుండగా
ఇంక తనకు మనగుడే లేదని తెలిసి ఆ హరివిల్లు మేఘాలను పుష్ఫలుగా చేసుకుని ఏడు రంగుల పూలజడగా మారగ

ఇలా జగుమున అందాలు అన్ని నీలో ఒకటి అవుతూ
అంతటి సుందర దుశ్ర్యములులను వర్ణించుటకు పదములు కరువై
ఇంతటి రమణీయమైన రూపాన్ని స్వప్నంలో సైతం ఊహించలేని విధంగా
నిన్ను సృష్టించిన ఆ మహానబావులకు వందనం అభివందనం

1 వ్యాఖలు:

అజ్ఞాత చెప్పారు...

1st para is very nice
i too like these 4 persons - rajesh